
రెండోరోజు ప్లాట్ల కేటాయింపు
కందుకూరు: ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు మండల పరిధిలోని మీర్‌ఖాన్‌పేట రెవెన్యూలో ఏర్పాటు చేసిన టీజీఐఐసీ లేఅవుట్‌లోని ఏటీసీ సెంటర్‌లో మంగళవారం రెండో రోజు లాటరీ ద్వారా ప్లాట్ల పంపిణీ కొనసాగింది. కందుకూరు, ఇబ్రహీంపట్నం ఆర్డీఓలు జగదీశ్వర్‌రెడ్డి, అనంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి లాటరీ ద్వారా లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించారు. 121 గజాలు సర్టిఫికెట్లు పొందిన లబ్ధిదారులకు పంపిణీ నిర్వహించారు. మొత్తం 1,051 మంది ఉండగా 718 మంది డ్రాలో పాల్గొన్నారని, 333 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. కాగా బుధవారం 181 గజాల లబ్ధిదారులకు లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించనున్నట్లు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల వరకు లబ్ధిదారులు లేఅవుట్‌లోకి చేరుకోవాలని సూచించారు.