
కనకదుర్గమ్మకు జోడు బోనాలు
చార్మినార్: ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం విజయవాడ కనక దుర్గ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించారు. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో పాతబస్తీలోని వివిధ దేవాలయాలకు చెందిన ప్రతినిధుల బృందంతో పాటు అక్కన్న మాదన్న దేవాలయం కమిటీ సభ్యులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. జోగిని శ్యామల వెండి బోనం ఎత్తారు. ఈసారి బంగారు బోనాన్ని కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ సతీమణి సంగీత ఎత్తుకున్నారు. ఈసారి విజయవాడ కనక దుర్గమ్మకు బంగారు, వెండి పాత్రల్లో జోడు బోనాలు సమర్పించారు.