
ఇంటి నుంచి బయటకు వెళ్లి
పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ దయాకర్‌రెడ్డి గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడ గ్రామానికి చెందిన జర్పుల దేశ్య కుమార్తె రజిత(26) ప్రైవేట్ ఉద్యోగి. ఈ నెల 25వ తేదీన మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. ఆచూకీ కోసం సాధ్యమైన ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె తల్లి సీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 87126 62367 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
షాబాద్‌లో వివాహిత..
షాబాద్: ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ గ్రామానికి చెందిన సొన్నాయిల స్వాతి ఈ నెల 22వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఆమె కోసం బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం ఆమె భర్త నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరికై నా ఆచూకీ తెలిస్తే వెంటనే 99897 92750 నంబరుకు సమాచారం అందించాలని సూచించారు.
వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళల అదృశ్యం

ఇంటి నుంచి బయటకు వెళ్లి