షార్ట్ సర్క్యూట్‌తో హోటల్ దగ్ధం
షాద్‌నగర్‌రూరల్: షార్ట్ సర్క్యూట్‌తో ఓ హోటల్ దగ్ధమైన సంఘటన ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని ఎలికట్టలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలిచంద్రయ్య హోటల్ నిర్వహిస్తూ జీవనోపాధిని పొందుతున్నాడు. బుధవారం రాత్రి ఎప్పటిలాగే హోటల్‌ను మూసివేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తరువాత షార్ట్ సర్క్యూట్ కావడంతో హోటల్‌లోని సామగ్రి, వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. గురువారం తెల్లవారుజామున చంద్రయ్య చూడగా దట్టమైన పొగతో నిండిపోయింది. హోటల్‌లోని ప్రిడ్జ్‌లు, కౌంటర్‌లు, కంప్యూటర్, ప్రింటర్, సీసీ కెమెరాల ఎక్విప్‌మెంట్, ఫ్యాన్‌లు, కుర్చీలు, కూల్ డ్రింక్, వాటర్ బాటిళ్లు పూర్తిగా కాలిపోయాయి. విషయాన్ని తెలుసుకున్న ఆర్‌ఐ సలీం, పంచాయతీ కార్యదర్శి తేజస్విని ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ షార్ట్ సర్క్యూట్‌తో దాదాపు రూ.2లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు హోటల్ యజమాని చంద్రయ్య తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు.


