ప్రమాణం చేయక ముందే హామీ నిలబెట్టుకుని | - | Sakshi
Sakshi News home page

ప్రమాణం చేయక ముందే హామీ నిలబెట్టుకుని

Dec 22 2025 9:03 AM | Updated on Dec 22 2025 9:03 AM

ప్రమాణం చేయక ముందే హామీ నిలబెట్టుకుని

ప్రమాణం చేయక ముందే హామీ నిలబెట్టుకుని

కేశంపేట: ఎన్నికల సమయంలో నాయకులు హా మీలు ఇస్తుంటారు.. మర్చి పోతుంటారు.. కానీ ఆ గ్రామంలో వార్డు సభ్యురాలు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాన్ని ప్రమాణ స్వీకారం చేయక ముందే నిలబెట్టుకున్నారు. మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలోని 4వ వార్డు సభ్యురాలిగా పసుల స్వప్న ఎన్నికల బరిలో నిలిచారు. ప్రచారం నిర్వహిస్తుండగా నీటి సమస్యను కాలనీవాసుల ద్వారా తెలుసుకొని నూతనంగా బోరు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం వార్డులో బోరు వేయించారు. త్వరలోనే మోటారును ఏర్పాటు చేసి కాలనీలో నీటి ఎద్దడి నివారణకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు మల్లేశ్‌యాదవ్‌, మాజీ సర్పంచ్‌ నవీన్‌కుమార్‌, ఉప సర్పంచ్‌ దర్శన్‌, మాజీ మండల కో–ఆప్షన్‌ సభ్యులు జమాల్‌ఖాన్‌, నరేష్‌ యాదవ్‌, కుంటి లక్ష్మయ్య, జగన్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, పాల్గొన్నారు.

న్యూఇయర్‌ వేడుకల్లో మద్యం

వినియోగానికి అనుమతి తప్పనిసరి

రాజేంద్రనగర్‌: నూతన సంవత్సరం ప్రారంభ వేడుకల్లో మద్యాన్ని వినియోగించాలనుకుంటే తప్పనిసరిగా ఎకై ్సజ్‌ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని శంషాబాద్‌ ఎకై ్సజ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ దేవేందర్‌ సూచించారు. ఈవెంట్లతో పాటు ఫంక్షన్‌ హాళ్లు, క్లబ్‌లు, ఫామ్‌హౌస్‌ తదితర ప్రాంతాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో మద్యం సేవిస్తే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. ఆదివారం ఉప్పర్‌పల్లిలోని స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గత సంవత్సరం స్టేషన్‌ పరిధిలో 20 ఈవెంట్లు నిర్వహించారన్నారు. వారందరికీ ఎకై ్సజ్‌ శాఖ తరఫున మద్యం వినియోగించేందుకు అనుమతులు ఇచ్చామన్నారు. అనుమతులు తీసుకోకుండా ఈవెంట్లు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. స్టేషన్‌లో సైతం దరఖాస్తు చేసుకునేందుకు వీలు ఉందన్నారు. వేడుకల్లో విదేశీ మద్యంతో పాటు ఇతర రాష్ట్రాల మద్యం, డ్యూటీ ఫ్రీ మద్యాన్ని వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు

అనుమానాస్పదస్థితిలో మహిళ ఆత్మహత్య

ఇబ్రహీంపట్నం: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురంలోని ఎన్‌జీవో కాలనీలో నివసించే సంజనా(32)కు మంగళ్‌పల్లిలో నివసించే ఆమనగల్లుకు చెందిన సాయినాథ్‌రెడ్డితో కొన్నేళ్లుగా పరిచయం ఉంది. వీరిద్దరి మధ్య వివాదం చోటు చేసుకోవడంతో 15 రోజుల క్రితం చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో తానను ఇబ్బంది పెడుతున్నట్లు సాయినాథ్‌రెడ్డిపై సంజన ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మాట్లాడుకునేందుకు సాయినాథ్‌రెడ్డి ఇంటికి ఆమె శనివారం రాత్రి వచ్చారు. ఈ క్రమంలోనే మరోసారి ఘర్షణ జరిగి సంజనా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ బంధువులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా సంజనాకు భర్త, కుమారుడున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement