ఎన్నికల కమిషనర్‌ను కలిసిన సీపీ
సాక్షి,సిటీ బ్యూరో: నగర పర్యటనకు వచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నగర పోలీస్ పరిపాలన తరఫున పోలీస్ కమిషనర్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు స్వాగతం పలికారు.
లారీ ఢీకొని ఇద్దరి మృతి
మేడ్చల్‌రూరల్: లారీ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓఆర్‌ఆర్‌పై చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శనివారం రాత్రి మేడ్చల్ నుంచి శామీర్‌పేట్ వైపు వెళ్తున్న బోర్‌వెల్ లారీ వాహనం (బ్రేక్‌డౌన్)మరమ్మత్తులకు గురైంది. వాహనంలో ఉన్న డ్రైవర్‌తో పాటు సిబ్బంది మరమ్మతులు చేస్తుండగా అదే సమయంలో వేగంగా వచ్చిన మరో లారీ ఆగి ఉన్న వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో రోడ్డుపై మరమ్మతు చేస్తున భువనగిరి జిల్లాకు చెందిన సురేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, హయత్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మద్యం మత్తులో వేగంగా వచ్చి ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


