
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దరఖాస్తుల ఆహ్వానం
చేవెళ్ల: ప్రభుత్వ డిగ్రీ కళాశాల చేవెళ్లలో 2025– 26 విద్యాసంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా క్టర్ సీహెచ్ కాంచనలత సోమవారం ఒక ప్రక టనలో పేర్కొన్నారు. కళాశాలలో విద్యార్థుల కోసం బీఏ (ఇంగ్లిష్, తెలుగు మీడియం), బీ కాం (కంప్యూటర్ అప్లికేషన్),బీఎస్సీ (లైఫ్ సై న్సెస్), బీఎస్సీ (ఫిజికల్ సైన్స్) కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. అసక్తిగల అభ్యర్థులు అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కళాశాల దోస్త్ కోడ్ 12041 అని చెప్పారు. వివరాలకు 94901 17490, 83281 76599 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
మోడల్ కళాశాలలో
ఇంటర్ ప్రవేశాలు
కందుకూరు: మండలంలోని నేదునూరు పరిధిలోని మోడల్ స్కూల్, కళాశాలలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ విష్ణుప్రియ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూప్‌ల్లో ఆంగ్ల మాధ్యమంలో చేరేందుకు ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 20వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రతి గూప్‌లో 40 సీట్లు మాత్రమే ఉంటాయన్నారు. అర్హత గల విద్యార్థులకు హాస్టల్ వసతి సౌకర్యం ఉంటుందన్నారు. ఎంపికై న విద్యార్థుల వివరాలను ఈ నెల 26న వెబ్‌సైట్‌లో ఉంచుతామని, 27 నుంచి 31వ తేదీ వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో వస్తే పరిశీలించి ప్రవేశానికి అర్హత కల్పిస్తామన్నారు. జూన్ 2 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. అర్హత గల విద్యార్థులు హెచ్‌టీటీపీ://183.82.97. 97/ఎంఎస్‌టీజీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణి ఫిర్యాదులకు సత్వరమే పరిష్కారం చూపించాలని జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి, కలెక్టరేట్ ఏఓ సునీల్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, కలెక్టరేట్ ఏఓ సునీల్ అర్జీలు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈవారం మొత్తం 51 ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, మున్సిప ల్ అధికారులు, తహసీల్దారులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే
ప్రభుత్వ లక్ష్యం
కడ్తాల్: రైతు సంక్షేమం, ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి అన్నారు. మండల కేంద్రంతో పాటు, మండల పరిధిలోని ముద్వీన్‌లో పీఏసీఎస్ ఆమనగల్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొను గోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతన్నలకందిస్తున్న చేయూతతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు దళారులకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ గంప వెంకటేశ్‌గుప్తా, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్‌రెడ్డి, సింగిల్‌విండో వైస్ చైర్మన్ సత్యం, డీసీసీ ప్రధాన కార్యదర్శి బీక్యానాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, కడ్తాల్, తలకొండపల్లి మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు బీచ్యానాయక్, ప్రభాకర్‌రెడ్డి, పీఏసీఎస్ సీఈఓ దేవేందర్, మండల వ్యవసాయ అధికారులు శ్రీలత, అరుణకుమారి పాల్గొన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దరఖాస్తుల ఆహ్వానం