
ఓవర్ టు రిసీవింగ్ సెంటర్
చేవెళ్ల: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో సోమవారం రాత్రి పోలింగ్ కేంద్రాల నుంచి అధికారులు, సిబ్బంది పోలింగ్ యంత్రాలు, సామగ్రితో రిసీవింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. అయితే ఈసారి పోలింగ్ సమయం సాయంత్రం 6గంటల వరకు పెట్టడంతో పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బందికి యంత్రాల ప్యాకింగ్, పోలైన ఓట్ల లెక్కలు సరిచేసుకునేసరికి రాత్రి అయ్యింది. అక్కడి నుంచి సెక్టార్ల వారీగా వచ్చే బస్సుల్లో ఎక్కి చేవెళ్ల మండలంలోని గొల్లపల్లి సమీపంలోని బండారు శ్రీనివాస్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన రిసీవింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అక్కడ అధికారులు ముందస్తుగా సెక్టార్ల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో పోలింగ్ బూత్‌వారీగా ఈవీఎంలు, వీవీప్యాట్‌ల యంత్రాలు, ఎన్నికల సామగ్రిని అప్పగించారు. చేవెళ్ల అసెంబ్లీ పరిధిలోని ఐదు మండలాల నుంచి అంతా ఇక్కడేకి రావాల్సి రావడంతో ఉద్యోగులకు అర్ధర్రాతి దాటింది. దీంతో ఎన్నికల సామగ్రిని అప్పగించి తిరిగి వారివారి ఇళ్లకు వేళ్లేందుకు ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ముందస్తుగానే వ్యక్తిగత వాహనాలు ఏర్పాటు చేసుకున్న వారు ఇళ్లకు చేరుకోగా ఆలస్యమైన వారు ఇబ్బంది పడ్డారు. పోలింగ్ కేంద్రాలనుంచి వచ్చే ఉద్యోగులకు రిసీవింగ్ కేంద్రం వద్ద భోజన వసతిని కల్పించారు.
ఓట్ల అనంతరం పోలింగ్ సామగ్రితో తిరిగి వచ్చిన సిబ్బంది
అర్ధరాత్రి వరకు కొనసాగిన ఈవీఎం, వీవీ ప్యాట్ల అప్పగింత ప్రక్రియ

ఓవర్ టు రిసీవింగ్ సెంటర్