
రంగారెడ్డి: ఇద్దరు పిల్లలతో కలిసి గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కె.మధుసూదన్ తెలిపిన ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం గొల్లోనిపల్లికి చెందిన గోగుల శ్రీను తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఈ నెల 23న తుక్కుగూడలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లాడు. 26న స్వగ్రామానికి బయలు దేరారు.
దీంతో అనిత(29) తాను కంటి సమస్యతో బాధపడుతున్నాని కూతుర్లు నిహారిక(8), రిషి(5)ని తీసుకుని బస్‌కు వస్తానని.. కుమారుడిని తీసుకుని బైక్‌పై వెళ్లడండని భర్తకు సూచించింది. ఇంటికి చేరకున్న శ్రీను భార్య ఎంతకూ రాలేదు. ఆయన ఎక్కడ వెతికినా ఆచూకీ లభ్యమవ్వక పోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహడీషరీఫ్ పీఎస్‌లో గానీ, 87126 62367 నెంబర్‌లో గాని సమాచారం అందించాలని కోరారు.