
ఎర్రకుంటలో మట్టిని తవ్విన ప్రాంతం
అడ్డుకున్న రైతులు
యాచారం: మంతన్‌గౌరెల్లి–కేసీ తండా గ్రామాల మధ్యనున్న ఎర్రకుంట నుంచి ఇటుక బట్టీల వ్యాపారులు రాత్రికిరాత్రే మట్టిని తరలించారు. శని, ఆదివారాల్లో రాత్రిళ్లు జేసీబీ పెట్టి వందలాది ట్రిప్పుల మట్టిని టిప్పర్లలో నగరానికి తరలించారు. ఆదివారం రాత్రి గమనించిన మంతన్‌గౌరెల్లి, కేసీ తండాల రైతులు మట్టి తవ్వకాన్ని అడ్డుకుని పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేశారు. అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేసీ తండా సర్పంచ్ మారు, ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నేనావత్ శంకర్‌నాయక్ డిమాండ్ చేశారు.