
పండుగలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి
ఏసీపీ రంగస్వామి
షాద్‌నగర్: పండుగలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఏసీపీ రంగస్వామి సూచించారు. హనుమాన్ జయంతి శోభాయాత్ర, బక్రీద్ పండుగ, సందర్భంగా పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో మంగళవారం శాంతి సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏసీపీ రంగస్వామి మాట్లాడుతూ.. ప్రత ఒక్కరు పరమత సహనం పాటించాలన్నారు. బక్రీద్, హనుమాన్ జయంతి వేడుకలు హిందూ, ముస్లింలు సోదరభావంతో ఐకమత్యంగా జరుపుకోవాలని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై పై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ విజయ్‌కుమార్, ఎస్‌ఐ విజయ్‌కుమార్, నాయకులు బాబర్‌ఖాన్, ఇబ్రహీం, వెంకటేశ్, జమృద్‌ఖాన్, సిరాజుద్దీన్ పాల్గొన్నారు.