
అవార్డు అందుకుంటున్న జంప్లానాయక్
కడ్తాల్: కేఎన్‌ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్‌లో ఎంసీహెచ్ కార్డియో థొరాసిక్ సర్జరీ (ఓపెన్ హార్ట్ సర్జరీ) విభాగంలో మండల కేంద్రానికి చెందిన డాక్టర్ జంప్లానాయక్ గోల్డ్‌మెడల్ సాధించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాల ఆడిటోరియంలో నిర్హహించిన కార్యక్రమంలో కాళోజీ నారాయణ రావు (కేఎన్‌ఆర్) హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ బి.కరుణాకర్‌రెడ్డి, ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళారెడ్డి, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నోజేందర్ ఆయనకు గోల్డ్ మెడల్ అందజేశారు. డాక్టర్ జంప్లానాయక్ గోల్డ్ మెడల్ సాధించడం పట్ల మండల కేంద్రానికి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మున్ముందు వైద్యరంగంలో మరింత ఉన్నత స్థానంలోకి ఎదగాలని అకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గోల్డ్‌మెడల్ కమిటీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎన్.కృష్ణారెడ్డి, ఉస్మానియా ఆస్పత్రి పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎం.వీరేశం, కార్యదర్శి డాక్టర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.