యాచారం: నందివనపర్తి ఓంకారేశ్వరాలయ భూమిని టీఎస్‌ఐఐసీకి అప్పగించడానికి రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్ణయించింది. నందివనపర్తిలో ఉన్న ఓంకారేశ్వరాలయానికి నందివనపర్తి గ్రామంతో పాటు నస్దిక్‌సింగారం, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో 145 సర్వే నంబర్ నుంచి 230 సర్వే నంబర్ వరకు 1,400 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఆయా గ్రామాల్లో ఓంకారేశ్వరాలయానికి చెందిన 1,100 ఎకరాల భూమిని తమకు కేటాయించాలని కొద్ది నెలల క్రితం టీఎస్‌ఐఐసీ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖకు విన్నవించింది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ నుంచి స్పష్టమైన హామీ లభించడంతో ఆలయ భూమి సేకరణ కోసం త్వరలో టీఎస్‌ఐఐసీ అవార్డు జారీ చేయనుంది. అవార్డుకు ముందే ఆలయ భూమిని పూర్తిగా సర్వే చేసి హ ద్దులు గుర్తించనున్నారు. పరిహారం ధర నిర్ణయం పూర్తి కాగానే డబ్బులను నందివనపర్తి గ్రామంలోని ఎస్‌బీఐలో ఉన్న ఓంకారేశ్వరుడి ఖాతాలో టీఎస్‌ఐఐసీ జమ చేయనుంది.
ఏళ్లుగా కౌలు రైతుల సాగు
నందివనపర్తిలోని ఓంకారేశ్వరాలయానికి చెందిన 80 సర్వే నంబర్లలోని 1,400 ఎకరాల భూమిపై 60 ఏళ్లుగా నందివనపర్తి, నస్దిక్‌సింగారం, కుర్మిద్ద, తాడిపర్తి గ్రామాలకు చెందిన సుమారు 600 మందికిపైగా రైతులు సాగు చేసుకుని జీవనోపాధి పొందు తున్నారు. కౌలు రైతులకు 37 ఏ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. ఏళ్లుగా దేవాలయానికి కౌలు కూడ చెల్లిస్తున్నారు. ఏళ్లుగా సాగులో లేని భూమిని యోగ్యంగా మార్చుకోవడం కోసం రూ.లక్షల్లో ఖర్చు చేశా రు. తాజాగా టీఎస్‌ఐఐసీ ఓంకారేశ్వరాలయ భూ ములను తీసుకుంటుందని తెలియడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. కౌలు రైతులు తమకు 37 ఏ సర్టిఫికెట్లు ఉన్నాయని.. కబ్జాలో ఉన్నాం.. తమకే ఆ భూములపై పట్టాదారు, పాసుపుస్తకాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై ఆలయ ఈఓ ప్రవీణకుమార్‌ను స్రంపదించగా 1,100 ఎకరాలకు పైగా ఆలయ భూమిని టీఎస్‌ఐఐసీ తీసుకోవడానికి నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలో అధికార జీవో వస్తుందన్నారు.
సానుకూలంగా స్పందించిన
దేవాదాయ, ధర్మాదాయ శాఖ