
లారీని ఢీకొన్న బస్సు
కొత్తూరు: ముందు వెళుతున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో బస్సు డ్రైవర్ రాములు, కండక్టర్ వేణుగోపాల్‌చారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని తిమ్మాపూర్ శివారులో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ శంకర్ కథనం మేరకు.. వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వనపర్తి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. శనివారం రాత్రి తిమ్మాపూర్ శివారులోకి రాగానే అదే మార్గంలో ఐరన్ (ఇనుప చువ్వల)లోడ్‌తో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్‌కు తీవ్ర గాయాలు కాగా పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.