తెలుగులో తీర్పుతో గుర్తింపు
1986 నుంచి కరీంనగర్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే 1992లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్షలో విజయం సాధించారు గొట్టె రవీందర్. ఆదిలాబాద్, సిర్పూర్, వరంగల్‌లో విధులు నిర్వర్తించారు. పదోన్నతిపై సీనియర్ ఏపీపీగా నర్సంపేటలో బాధ్యతలు నిర్వహిస్తూ 2004లో తిరిగి జ్యుడీషియల్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. కర్నూలు, డోన్‌లో పనిచేశారు. సీనియర్ సివిల్ జడ్జిగా 2013లో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు, నాంపెల్లి కోర్టులో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. తెలుగులో తీర్పునిచ్చిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.
– గొట్టె రవీందర్, విశ్రాంత న్యాయమూర్తి
సేవ చేయాలన్న సంకల్పంతో...
విద్యార్థి దశ నుంచే నెహ్రూ యువకేంద్రం ద్వారా సామాజిక సేవలపై ఆసక్తి పెరిగింది ఆసాని జయశ్రీకి. టీచర్‌గా పనిచేసిన తండ్రి రాజారెడ్డి స్వచ్ఛంద సేవలే స్ఫూర్తిగా న్యాయవిద్యను పూర్తి చేశారు. 1996లో న్యాయవాదిగా నమోదై.. మెట్‌పల్లిలో నాలుగేళ్లపాటు ప్రాక్టీస్ చేశారు. అనంతరం కుటుంబంతోపాటు కరీంనగర్‌కు షిఫ్ట్ అయ్యారు. స్థానికసంస్థల్లో సర్పంచ్‌లు, వార్డుసభ్యులకు పలు మార్లు శిక్షణ ఇచ్చారు. జ్యుడీషియల్ శాఖలోకి 2015లో అడుగుపెట్టి పెద్దపల్లి, కరీంనగర్, ప్రస్తుతం సిరిసిల్లలో విధులు నిర్వహిస్తున్నారు.
– ఆసాని జయశ్రీ, స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్
తెలుగులో తీర్పుతో గుర్తింపు


