కాంగ్రెస్, బీజేపీలు గ్రామాలను నిర్లక్ష్యం చేశాయి
● బీఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ధి ● పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
సిరిసిల్ల అర్బన్: కాంగ్రెస్, బీజేపీలే గ్రామాలను నిర్లక్ష్యం చేశాయని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. సిరిసిల్లోని తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గంలోని 117 గ్రామాలకు 80 గ్రామాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కే దక్కిందన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ కేవలం 24 స్థానాలకే పరిమితం కాగా, బీజేపీ 13 స్థానాలే గెలిచిందన్నారు. అధికార పార్టీ నాయకులు ఎన్ని గొప్పలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ గుర్తులతో ఉంటాయి కాబట్టి ప్రజలు ఏకపక్షంగా బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నాయకులు గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మణ్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, ఎండీ సత్తార్ తదితరులు పాల్గొన్నారు.


