నేడు సిరిసిల్లకు కేటీఆర్
సిరిసిల్ల: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు శుక్రవారం జిల్లాకు వస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్‌ఎస్ మద్దతుదారులైన సర్పంచ్‌లను సన్మానించనున్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈమేరకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సిరిసిల్లటౌన్/బోయినపల్లి(చొప్పదండి): జిల్లాలోని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, లింగ నిర్ధారణ నేరమని డీఎంహెచ్‌వో డాక్టర్ రజిత అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గర్భస్థ పిండ లింగనిర్ధారణ నిరోధక చట్టం అమలుపై జిల్లా సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 27 స్కానింగ్ కేంద్రాలు పనితీరుపై చర్చించారు. ఏడు స్కానింగ్ సెంటర్ల రెన్యూవల్ దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వైద్యులు నాగేంద్రబాబు, సంపత్‌కుమార్, ఎన్జీవో ప్రెసిడెంట్ చింతోజ్ భాస్కర్, డెమో రాజ్‌కుమార్, సీహెచ్‌వో బాలచంద్రం, మహేశ్ పాల్గొన్నారు.
సాధారణ ప్రసవాలు పెంచాలి
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని డీఎంహెచ్‌వో రజిత సూచించారు. మండలంలోని విలాసాగర్, బోయినపల్లి పీహెచ్‌సీ లను గురువారం తనిఖీ చేశారు. కేంద్ర ఆరోగ్య పథకాల పనితీరుపై సిబ్బందితో సమీక్షించారు. ఆడపిల్లల జననాలు(సెక్స్ రేషియో) తక్కువగా ఉండడానికి కారణాలపై సమీక్షించి, లక్ష్యాలు సాధించాలన్నారు. వైద్యులు నాగేంద్రబాబు, అనిత, నయీమా పాల్గొన్నారు.
వేములవాడ: ప్రజలకు సేవ చేసి అభిమానం సంపాదించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం సూచించారు. వేములవాడ బార్ అసోసియేషన్‌కు చెందిన నలుగు రు అడ్వకేట్లు ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో గెలు పొందడంతో వారిని గురువారం సన్మానించా రు. బోయినపల్లి మండలం దుండ్రపల్లి సర్పంచ్‌గా ఎన్నికై న జంగం అంజయ్య, నాగయ్యపల్లి వార్డుమెంబర్‌గా గెలిచిన తోట శేఖర్, మల్లారం వార్డు సభ్యుడిగా ఎన్నికై న మారుముఖం అనిల్, అనంతపల్లి వార్డు సభ్యుడిగా ఎన్నికై న అనిల్‌ను సన్మానించారు. ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు జనార్దన్ పాల్గొన్నారు.
సిరిసిల్ల అర్బన్: ఆశవర్కర్లకు రావలసిన లెప్రసీ, పల్స్‌పోలియో, ఎలక్షన్ డ్యూటీలు, ఇతర స ర్వేలకు సంబంధించిన పెండింగ్ డబ్బులు అందించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ కోరారు. ఆశవర్కర్లతో కలిసి గురువా రం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందించారు. ఆశవర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బదవేని మంజుల, కార్యదర్శి జయశ్రీల, గా యత్రి, జమున, లత, లావణ్య పాల్గొన్నారు.
నేడు సిరిసిల్లకు కేటీఆర్
నేడు సిరిసిల్లకు కేటీఆర్
నేడు సిరిసిల్లకు కేటీఆర్


