డ్రగ్స్‌తో భవిష్యత్ అంధకారం
● జిల్లా బాలల పరిరక్షణ అధికారి కవిత
సిరిసిల్ల: డ్రగ్స్‌కు అలవాటుపడితే భవిష్యత్ అంధకారమవుతుందని జిల్లా బాలల పరిరక్షణ అధికారి కవిత పేర్కొన్నారు. అగ్రహారంలోని సిరిసిల్ల పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా కో ఆర్డినేటర్ స్రవంతి మాట్లాడుతూ యువతులకు ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన 1098ను సంప్రదించాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్‌చారి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్‌నకు ఎంపిక
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని జిల్లెల్ల వ్యవసాయ కళాశాల విద్యార్థి రమావత్ ఛత్రపతి జాతీయస్థాయి రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎంపికయ్యాడు. జిల్ల్లెల్లలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, బాబు జగ్జీవన్ రామ్ అగ్రికల్చర్ కశాశాలలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్నాడు. ఇటీవల గుజరాత్‌లో నిర్వహించిన వెస్ట్‌జోన్ ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ క్యాంపులో ప్రతిభ కనబర్చి జాతీయ రిపబ్లిక్ డే పరేడ్ క్యాంపునకు ఎంపికయ్యాడు. స్వస్థలం నాగర్‌కర్నూలు జిల్లా. యూనివర్సిటీ వీసీ, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ కేవీ సునీతాదేవి, కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ఇన్‌చార్జి డాక్టర్ ఆర్.సాయికుమార్, డాక్టర్ జి.ప్రియదర్శిని అభినందించారు.


