వేడినీళ్లు.. నోరూరించే టిఫిన్లు
పెద్దపల్లిరూరల్: గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల సిబ్బంది వసతి, సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పక్కా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకున్నారు. పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాల్లో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన పోలింగ్, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో విధులను నిర్వహించేందుకు వచ్చిన పోలింగ్ అధికారులు, ఓపీవోలు, మెడికల్, పోలీసు, తదితర సిబ్బందికి అవసరమైన వసతీసౌకర్యాలు మెరుగ్గా కల్పించారు.
85 పంచాయతీల్లో ఎన్నికలు..
జిల్లాలో ఆఖరువిడత పంచాయతీ ఎన్నికల్లో 85 సర్పంచ్, 636 వార్డు స్థానాల కోసం నిర్వహించిన ఎన్నికల్లో సిబ్బందికి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. ఇందులో 128 మంది పోలింగ్ అధికారులు, 166 మంది ఓపీవో తదితర సిబ్బందికి అవసరమైన సౌకర్యాలను ఆయా కేంద్రాల సమీపంలో కల్పించారు. వణికిస్తున్న చలిలో ఉదయమే స్నానం చేసేందుకు వీలుగా వేడినీటిని కూడా అందించారు. నోరూరించే అల్పాహారం, రుచికరమైన భోజనం అందించినట్లు పలువురు ఎన్నికల సిబ్బంది చెప్పారు. ఏర్పాట్లపై కొందరిని పలుకరించగా..
కడుపునిండా రుచికరమైన భోజనం
ఎన్నికల విధుల నిర్వహణ తృప్తినిచ్చింది
పోలింగ్, లెక్కింపు కేంద్రాల్లో సౌకర్యాలు భేష్
స్థానిక అధికారుల సహకారంతో సమస్యలు దూరం
ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగుల మనోగతం


