పల్లె పోరు బహుముఖం
మండలాల వారీగా ఎన్నికల స్వరూపం
సిరిసిల్ల: జిల్లాలోని తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలు బుధవారం జరుగనున్నాయి. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లోని గ్రామాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. పల్లెల్లో ఎన్నికల పోరు బహుముఖంగా సాగుతుంది. ఆఖరు విడత 80 గ్రామాల్లో సర్పంచు స్థానాలకు 380 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, 551 వార్డుసభ్యుల స్థానాలకు 1,639 మంది బరిలో ఉన్నారు. తుదివిడత ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో 87 గ్రామాలకు, 762 వార్డులకు ఎన్నికల షెడ్యూల్ జారీ కాగా.. నామినేషన్ల పర్వం ముగిసే నాటికి ఏడు సర్పంచులు, 211 వార్డుమెంబర్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన గ్రామాల్లో బుధవారం జరిగే ఎన్నికలకు 914 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,244 మంది సిబ్బందిని నియమించారు. నాలుగు మండలాల్లోని 1,27,920 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
మహిళా ఓటర్లే అధికం
జిల్లాలోని తుది విడత ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. గంభీరావుపేట మండలంలో 17,811 మంది పురుషులు, 18,996 మహిళలు, ముస్తాబాద్ మండలంలో 18,658 మంది పురుషులు, మహిళా ఓటర్లు 19,842 ఉన్నారు. వీర్నపల్లి మండలంలో 5,769 మంది పురుషులు, 5,958 మంది మహిళలు, ఎల్లారెడ్డిపేట మండలంలో 19,690 మంది పురుషులు, 21,196 మహిళా ఓటర్లు ఉన్నారు.
పల్లెలకు తరలిన అధికారులు
ఎన్నికలు జరిగే పల్లెలకు మంగళవారం సాయంత్రం ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు తరలివెళ్లారు. ఎన్నికల సామగ్రి, అధికారులు, సిబ్బందిని వాహనాల్లో తరలించారు. ఎల్లారెడ్డిపేట మండలంలో ఏడు జోన్లు, పది రూట్లు ఏర్పాటు చేశారు. గంభీరావుపేట మండలంలో ఐదు జోన్లు, పది రూట్లు, ముస్తాబాద్ మండలంలో నాలుగు జోన్లు, ఎనిమిది రూట్లు, వీర్నపల్లి మండలంలో రెండు జోన్లు, ఐదు రూట్లతో ఎన్నికల ప్రణాళిక రూపొందించారు.
సమస్యాత్మక పల్లెల్లో కట్టుదిట్టమైన భద్రత
ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో 32 సమస్యాత్మక గ్రామాలు ఉండగా, వీటిలో 14 అత్యంత సమస్యాత్మక గ్రామాలను గుర్తించారు. గత ఎన్నికల్లో ఆయా గ్రామాల్లో జరిగిన గొడవలను అంచనా వేస్తూ పోలీసులు పటిష్ట రక్షణ ఏర్పాట్లు చేశారు.
ఉదయం 7 గంటల నుంచే..
బుధవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలై మధ్యాహ్నం 1 గంటలోగా ముగుస్తుంది. భోజన విరామం తర్వాత 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. లెక్కింపు పూర్తి కాగానే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. ఆఖరు విడత ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అఽధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
గంభీరావుపేట
గ్రామాలు: 22
ఓటర్లు: 36,807
ఏకగ్రీవమైన
గ్రామాలు: 03
ఎన్నికలు జరిగేవి:
19
బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు: 92
వార్డు సభ్యుల
అభ్యర్థులు: 491
పోలింగ్ సిబ్బంది:
577
ముస్తాబాద్
గ్రామాలు: 22
ఓటర్లు: 38,500
ఏకగ్రీవమైన
గ్రామాలు: 01
ఎన్నికలు జరిగేవి:
21
పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు: 95
వార్డు సభ్యుల
అభ్యర్థులు: 494
పోలింగ్ సిబ్బంది:
603
వీర్నపల్లి
గ్రామాలు: 17
ఓటర్లు: 11,727
ఏకగ్రీవమైన
గ్రామాలు: 01
ఎన్నికలు జరిగే
గ్రామాలు: 16
పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు: 73
వార్డు సభ్యుల
అభ్యర్థులు: 137
పోలింగ్ సిబ్బంది:
318
ఎల్లారెడ్డిపేట
గ్రామాలు: 26
ఓటర్లు: 40,886
ఏకగ్రీవమైన
గ్రామాలు: 02
ఎన్నికలు జరిగే
గ్రామాలు: 24
పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు: 120
వార్డు సభ్యుల
అభ్యర్థులు: 517
పోలింగ్ సిబ్బంది:
660
పల్లె పోరు బహుముఖం
పల్లె పోరు బహుముఖం
పల్లె పోరు బహుముఖం


