శభాష్ అర్చన
అర్చనను సన్మానిస్తున్న జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సిబ్బంది
సిరిసిల్ల: జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో పని చేస్తున్న దివ్యాంగ ఉద్యోగి మిట్టపల్లి అర్చన శ్రీలంకలో జరిగిన త్రోబాల్ పోటీల్లో బంగారు పతకం సాధించారు. దివ్యాంగుల పోటీల్లో దేశం తరఫున పాల్గొని బంగారు పతకం సాధించిన అర్చనను జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఇబ్బంది మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్చన ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి పట్టుదలతో దేశం తరఫున ఆడి విజయం సాధించిందన్నారు. చాలామంది సహ ఉద్యోగులు, ప్రభుత్వం ఇచ్చిన సహాయ సహకారంతో ఈ గుర్తింపు సాధించిందని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారని మహిళా సాధికరికత కేంద్రం కోఆర్డినేటర్ రోజా అన్నారు. అర్చన పట్టుదల, క్రమశిక్షణతో ఈ ఘనత సాధించిందని ఏసీడీపీవో సుచరిత అన్నారు. చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ స్రవంతి, సిబ్బంది శోభన, సంతోష్ కుమార్, శ్రీపాద పాల్గొన్నారు.
స్వచ్ఛ పాఠశాల సందర్శన
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని వెల్జిపురం హైస్కూల్‌ను మంగళవారం స్వచ్ఛ హరిత విద్యాలయ్ రాష్ట్ర పరిశీలకుడు రంగనాథ్ సందర్శించారు. పాఠశాలలోని పరిశుభ్రత, పచ్చదనం, కిచెన్ గార్డెన్, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల స్వచ్ఛ హరిత విద్యాలయంలో భాగంగా వెల్జిపురం హైస్కుల్ ఎంపికై ప్రశంసాపత్రం అందుకుంది. ఉపాధ్యాయులు స్వామిరెడ్డి, హరికృష్ణారెడ్డి, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్లఅర్బన్: సిరిసిల్ల మున్సిపల్ పరిధి ప దోవార్డు భూపతినగర్‌లో శ్మశానవాటిక స్థలాన్ని కబ్జాచేసిన వ్యక్తిపై చట్టపరంగా చర్య తీసుకోవాలని మాజీ కౌన్సిలర్ బొల్గం నాగరాజుగౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం శ్మశానవాటిక స్థలం వద్ద స్థానికులతో కలిసి ని రసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా భూపతినగర్ గ్రామస్తులు ఈ స్థలాన్ని శ్మశానవాటిక కోసం ఉపయోగిస్తున్నారని, గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కబ్జాచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇ టీవల మల్లేశం అనే వ్యక్తి మృతిచెందగా అత డి దినకర్మ కాకముందే అట్టి స్థలాన్ని ట్రాక్టర్‌తో చదును చేశారని, ఇప్పటికై నా సంబంధిత అధికారులు చర్య తీసుకోవాలని కోరారు.
ఎన్నికల విధుల్లో తోబుట్టువులు
ముస్తాబాద్(సిరిసిల్ల): ఎన్నికల విధులను తోబుట్టువులు కలిసి పంచుకున్నారు. ఒకే మండలంలో అన్నా, చెల్లి, తమ్ముళ్లకు విధులు రావడంతో ఆనందంగా కలిసి హాజరయ్యా రు. ముస్తాబాద్ జూనియర్ కళాశాలలో ఏర్పా టు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద అన్న, చెల్లి, తమ్ముడు మంగళవారం కలుసుకున్నా రు. గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన మరాటి పోశవ్వ, రాజయ్య దంపతులకు ఐదుగురు సంతానం. వీరిలో మరాటి మల్లికార్జున్ గంభీరావుపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో, మారాటి వెంకటలక్ష్మి రుద్రంగి మండలం మానాల ప్రభుత్వ పాఠశాలలో, వీరి సోదరుడు మరాటి అజయ్ సిరిసిల్ల తుకారంనగర్ ప్రాథమిక పాఠశాలలో టీచర్లుగా పనిచేస్తున్నారు. ముగ్గురూ ముస్తాబాద్ మండలంలో జరుగుతున్న ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు వచ్చారు. మల్లికార్జున్‌కు గన్నెవారిపల్లి, వెంకటలక్ష్మికి రామలక్ష్మణపల్లె, అజయ్‌కు కొండాపూర్‌లో విధులు కేటాయించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద వీరిని చూసినవారు తోబుట్టువులు కలుసుకున్నారని సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టారు.
శభాష్ అర్చన
శభాష్ అర్చన
శభాష్ అర్చన


