మెరుగైన వైద్యసేవలు అందించాలి
● స్టేట్ కన్సల్టెంట్ డాక్టర్ సత్యేంద్రనాథ్
సిరిసిల్ల: డయాబెటీస్, రక్తపోటు, గుండె సంబంధిత జబ్బులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, ఆన్‌లైన్ డేటాతో ఆధార్‌ను లింకుచేయాలని ఎన్‌సీడీ స్టేట్ కన్సల్టెంట్ డాక్టర్ సత్యేంద్రనాథ్ కోరారు. కలెక్టరేట్‌లోని వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో ఎన్‌సీడీ స్టాప్ నర్సులు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎంఎల్‌హెచ్‌పీ)లకు శుక్రవారం అవగాహన కల్పించారు. జిల్లా వైద్యాధికారి రజిత, ప్రోగ్రాం ఆఫీసర్లు వైద్యులు రామకృష్ణ, సంపత్‌కుమార్, అనిత, నయీమాజహా, డీడీఎం కార్తీక్ పాల్గొన్నారు.


