ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం
బోయినపల్లి(చొప్పదండి): రాష్ట్రంలో రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చిందని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మండలంలోని వరదవెల్లి దత్తాత్రేయస్వామి ఆలయంలో కొనసాగుతున్న దత్త జయంతి ఉత్సవాల్లో శుక్రవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి పూజలు చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దత్త జయంతి నాడే కాకుండా శాశ్వతంగా బోటు ఏర్పాటు చేసేందుకు సంబంధించిన ఫైల్ ఇరిగేషన్ శాఖ వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. డీసీఎమ్మెస్ డైరెక్టర్ ఎం.సురేందర్‌రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టెపెల్లి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్‌యాదవ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి ఉన్నారు.
డీసీసీ అధ్యక్షుడి పూజలు
డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ దత్తాత్రేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడ టౌన్, రూరల్ ఎస్సైలు ఎల్లాగౌడ్, రామ్మోహన్ తదితరులు పూజలు చేశారు.


