ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

Dec 6 2025 7:26 AM | Updated on Dec 6 2025 7:26 AM

ఎన్ని

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి ● రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రవికుమార్‌ నామినేషన్లు సజావుగా పూర్తి చేయండి నేల ఆరోగ్యాన్ని కాపాడాలి మహిళలపై వేధింపులు ఉండొద్దు ● జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం ● ఉద్యోగానికి రాజీనామా

● రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రవికుమార్‌

ముస్తాబాద్‌(సిరిసిల్ల): పంచాయతీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రవికుమార్‌ పేర్కొన్నారు. ముస్తాబాద్‌, నామాపూర్‌, గూడెంలోని ఎన్నికల క్లస్టర్‌లను శుక్రవారం పరిశీలించారు. అభ్యర్థులకు కావాల్సిన సహాయాన్ని హెల్పింగ్‌డెస్క్‌ ఎలా అందిస్తుందో తెలుసుకున్నారు. ఎంపీడీవో లచ్చాలు, ఎంపీవో వాహిద్‌ ఉన్నారు.

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నామినేషన్ల ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ అధికారులకు సూచించారు. మండలంలోని ఎల్లారెడ్డిపేట, హరిదాస్‌నగర్‌, వెంకటాపూర్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్‌ కేంద్రాలను పరిశీలించారు. తహసీల్దార్‌ సుజాత, మండల అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి సత్తయ్య తదితరులు ఉన్నారు.

తంగళ్లపల్లి(సిరిసిల్ల): నేల ఆరోగ్యాన్ని కాపాడడంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం కోరారు. మండలంలోని రాళ్లపేటలో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ మృత్తికా దినోత్సవంలో మాట్లాడారు. వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ కేబీ సునీతాదేవి మాట్లాడుతూ అర్బన్‌ ఫార్మింగ్‌, నేల ఆరోగ్యం గురించి వివరించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రొఫెసర్లు డాక్టర్‌ ఆర్‌.సాయికుమార్‌, డాక్టర్‌ పి.మాధవి, డాక్టర్‌ ఎం.సంపత్‌కుమార్‌, డాక్టర్‌ టి.అరుణ్‌బాబు, యశశ్విని, మండల వ్యవసాయాధికారి కనవేని సంజీవ్‌, సాయికిరణ్‌, ఏఈవో అనూష పాల్గొన్నారు.

సిరిసిల్ల అర్బన్‌: పనిప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు జరగకుండా చూడాలని జిల్లా సంక్షేమాధికారి పి.లక్ష్మీరాజం సూచించారు. సిరిసిల్ల పరిధిలోని అపరెల్‌ పార్క్‌లోని పంక్చుయేట్‌ వరల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ప్రతినిధులతో శుక్రవారం సమావేశమయ్యారు. లక్ష్మీరాజం మాట్లాడుతూ పనిప్రదేశాల్లో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్మికుల మానసికోల్లాసానికి చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లల డేకేర్‌ సెంటర్‌లో అందుతున్న సేవలు పరిశీలించారు.

పంచాయతీ బరిలో అంగన్‌వాడీ ఆయా

ఇల్లంతకుంట(మానకొండూర్‌): పంచాయతీ పోరులో అంగన్‌వాడీ ఆయా నిల్చున్నారు. మండలంలోని గొల్లపల్లికి చెందిన అంగన్‌వాడీ ఆయా కడగండ్ల శిరీష బీఎస్సీ చదివారు. 2017 నుంచి గ్రామంలో అంగన్‌వాడీ ఆయాగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు 2014లో సోమారంపేట ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి 23 ఓట్ల తేడాతో ఓడిపోయారు. గొల్లపల్లి గ్రామం ప్రస్తుతం ఎస్సీ మహిళకు రిజర్వ్‌ కావడంతో భర్త తిరుపతి ప్రోత్సాహంతో సర్పంచ్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అంగన్‌వాడీ ఆయా ఉద్యోగానికి రాజీనామా చేశారు.

ఎన్నికలు ప్రశాంతంగా   నిర్వహించాలి
1
1/4

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

ఎన్నికలు ప్రశాంతంగా   నిర్వహించాలి
2
2/4

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

ఎన్నికలు ప్రశాంతంగా   నిర్వహించాలి
3
3/4

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

ఎన్నికలు ప్రశాంతంగా   నిర్వహించాలి
4
4/4

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement