రగుడు జంక్షన్ పనులు ప్రారంభం
సిరిసిల్ల: రగుడు కలెక్టరేట్ జంక్షన్ వద్ద అభివృద్ధి పనులను శుక్రవారం ప్రారంభించారు. రూ.3.50 కోట్లతో చేపట్టిన కూడలి పనులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రమాదకరంగా మారిందంటూ ‘సాక్షి’లో ‘డేంజర్ జంక్షన్స్’ శీర్షికన నవంబరు 27న ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. కాంట్రాక్టర్‌ను పిలిచి పనులను ప్రారంభించారు. మున్సిపల్ డీఈఈ వాణి, వర్క్‌ఇన్‌స్పెక్టర్ అంజాగౌడ్ పనులను పర్యవేక్షించారు. రడుగు వైపు, కలెక్టరేట్ ఎదుట రెండు వేర్వేరుగా బస్ షెల్టర్లను రూ.12.50 లక్షలతో నిర్మించనున్నారు. ఇప్పటికే రిటర్నింగ్ వాల్ పూర్తి చేశారు.
రగుడు జంక్షన్ పనులు ప్రారంభం


