నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి
● ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్
ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్(సిరిసిల్ల): ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రిసైడింగ్ ఆఫీసర్లకు ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్, ముస్తాబాద్‌లోని రైతువేదికల్లో శుక్రవారం నిర్వహించిన శిక్షణ తరగతుల్లో మాట్లాడారు. పోలింగ్ కేంద్రాలలో విద్యుత్ సరఫరా, నీటి వసతి కల్పించాలని, ఎంపీడీవోలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి వసతులు పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. మండల ప్రత్యేకాధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవోలు సత్తయ్య, లచ్చాలు, ఎంపీవో వాహిద్ పాల్గొన్నారు.
బోయినపల్లి(చొప్పదండి): ఆర్వో, పీవోలు పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలని జెడ్పీ సీఈవో వినోద్ సూచించారు. కొదురుపాక రైతువేదికలో శిక్షణ తరగతుల్లో మాట్లాడారు.


