సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి

Dec 5 2025 6:54 AM | Updated on Dec 5 2025 6:54 AM

సిబ్బ

సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి

● మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌ పాషా కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర ● అదనపు కలెక్టర్‌ నగేశ్‌ ఆర్వో కేంద్రాలు పరిశీలన రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్న కేంద్రం ● సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలి వ్యయ వివరాలు పారదర్శకంగా ఉండాలి

● మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌ పాషా

సిరిసిల్ల: మున్సిపాలిటీలోని పారిశుధ్య సిబ్బంది విధిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కమిషనర్‌ ఖదీర్‌పాషా కోరారు. సినారె కళామందిరంలో నమస్తే స్కీంలో భాగంగా మున్సిపల్‌ సెప్టిక్‌ ట్యాంక్‌ కార్మికులు, శానిటేషన్‌, నాన్‌ శానిటరీ సిబ్బందికి గురువారం వైద్యశిబిరం నిర్వహించారు. కార్మికులకు పరీక్షలు చేసి, అవసరమైన మందులు అందించారు.

బోయినపల్లి/వేములవాడఅర్బన్‌: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ పేర్కొన్నారు. బోయినపల్లి మండలం మాన్వాడ, వేములవాడఅర్బన్‌ మండలం అనుపురం గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను గురువారం పరిశీలించారు. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, కేటాయించిన రైస్‌మిల్లులకు తరలించాలని సూచించారు. తహసీల్దార్‌ నారాయణరెడ్డి ఉన్నారు.

ఇల్లంతకుంట(మానకొండూర్‌): మండలంలోని వంతడుపుల, ఇల్లంతకుంట, పొత్తూరు, పెద్దలింగాపురం, గాలిపల్లి, అనంతారం గ్రామపంచాయతీల ఆర్వో కేంద్రాలను గురువారం అడిషనల్‌ ఎస్పీ చంద్రయ్య పరిశీలించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. ఏఎస్సై పసియొద్దీన్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ రాజేందర్‌ ఉన్నారు.

సిరిసిల్ల అర్బన్‌: కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కుతూ కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లలోని పార్టీ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆదివాసీలను లొంగిపోండి లేదా చంపుతామనే రీతిలో కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం తెలంగాణను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సుదర్శన్‌, జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారి రాములు, కౌన్సిల్‌ సభ్యులు వడ్డెపెల్లి లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు రవికుమార్‌ సూచించారు. మండలంలోని రాచర్లబొప్పాపూర్‌, రాచర్లగొల్లపల్లి గ్రామాల్లోని నామినేషన్‌ కేంద్రాలను గురువారం పరిశీలించారు. రవికుమార్‌ మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా అభ్యర్థులకు అవగాహన కల్పించాలన్నారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద మద్దతుదారులు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి సత్తయ్య, కార్యదర్శి రామకృష్ణ ఉన్నారు.

ఇల్లంతకుంట/బోయినపల్లి: సర్పంచ్‌, వార్డుసభ్యుల అభ్యర్థుల వ్యయ వివరాలు పారదర్శకంగా ఉండాలని ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకులు రాజ్‌కుమార్‌ సూచించారు. బోయినపల్లి, ఇల్లంతకుంట మండల పరిషత్‌లను గురువారం తనిఖీ చేశారు. ఎంపీడీవో శశికళ, నోడల్‌ అధికారి నవీన్‌, భారతి పాల్గొన్నారు.

సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి1
1/4

సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి

సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి2
2/4

సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి

సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి3
3/4

సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి

సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి4
4/4

సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement