● ఆలయ పరిసరాల్లోకి వాహనాలకు నో ఎంట్రీ ● భక్తుల కోసమే రో
భక్తుల తిప్పలు తప్పేలా..
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనులు ఊ పందుకోవడంతో ప్రధాన ఆలయంలో దర్శనాలు తాత్కాళికంగా నిలిపివేశారు. భీమన్నగుడిలో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ పెరుగుతుండడం.. సమ్మక్క భక్తుల రాక మొదలు కావడంతో ఆలయ అధికారులు, పోలీసులు సంయుక్తంగా వసతుల కల్పనపై దృష్టి సారించారు. భీమన్నగుడి చుట్టూ ప్రాంతాలను ఫ్రీ జోన్‌గా ఏర్పాటు చేశారు. భీమన్నగుడి మార్గంలో భక్తులు నడిచే ప్రాంతంలో వాహనాలను అనుమతించడం లేదు. అభివృద్ధి పనులు కొనసాగిస్తూనే భక్తులకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు.
భక్తుల సౌకర్యం కోసమే..
వేములవాడకు వచ్చే భక్తులు ఆలయ అభివృద్ధి పనులతో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో భీమన్నగుడి చుట్టూ ప్రాంతాలను ఫ్రీజోన్‌గా ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల వాహనాలు భీమన్నగుడి ఏరియాలోకి ప్రవేశించకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నారు. భీమన్నగుడి ఏరియాలోకి భక్తులు కాలినడకనే వచ్చి, తిరిగి వెళ్లిపోయేలా చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలకు అనుమతించకపోవడంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు ఉత్పన్నం కావు. దీంతో భక్తులు ప్రశాంతంగా వచ్చి మొక్కులు చెల్లించుకునే అవకాశం చిక్కుతుంది.
ఇది వేములవాడలోని అంబేడ్కర్‌చౌరస్తా నుంచి పార్వతీపురం వెళ్లే ప్రధాన రోడ్డు. గుడి విస్తరణ పనుల నేపథ్యంలో ఈ ప్రాంతంలో కల్యాణకట్టను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇటు ఆటోలు, కార్లు వెళ్లకుండా రోడ్డుపై తాత్కాళికంగా పిల్లర్లను బిగించారు. దీంతో ఈ ప్రాంతం ఫ్రీజోన్‌గా మారింది. భక్తులు కాలినడకన భీమన్న గుడికి చేరుకునే అవకాశం మెరుగుపడింది.


