రెండో రోజు నామినేషన్ల జోరు
నామినేషన్ వేసేందుకు వెళ్తున్న నర్సయ్య
మద్దతుదారులతో కనకరాజు
ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్/వీర్నపల్లి(సిరిసిల్ల): జిల్లాలోని రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో రెండో రోజు గురువారం నామినేషన్లు జోరుగా పడ్డాయి. ఎల్లారెడ్డిపేట మండలంలోని 26 గ్రామపంచాయతీలకు 47 మంది సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల స్థానాలకు 191 నామినేషన్లు దాఖలైనట్లు మండల అసిస్టెంట్ ఎన్నికల అధికారి సత్తయ్య తెలిపారు. ముస్తాబాద్ మండలంలోని సర్పంచ్ స్థానాలకు 43, వార్డు సభ్యుల స్థానాలకు 178 నామినేషను్‌ల్ దాఖలు చేశారని ఎంపీడీవో లచ్చాలు తెలిపారు. రెండు రోజుల్లో కలిపి సర్పంచ్ స్థానాలకు 87, వార్డు సభ్యుల స్థానాలకు 278 నామినేషన్లు వచ్చాయని వివరించారు. వీర్నపల్లి మండలంలోని 17 గ్రామపంచాయతీలకు 44 సర్పంచ్ నామినేషన్లు, వార్డ్ సభ్యులకు 51 నామినేషన్లు వచ్చాయని ఎంపీడీవో శ్రీలత తెలిపారు.
ఆస్పత్రి నుంచి నామినేషన్ కేంద్రానికి..
బీపీతో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ బలపరచిన ఎల్లారెడ్డిపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి అంతర్పుల కనకరాజు.. చికిత్స అనంతరం నేరుగా నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. రెండు రోజులపాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందిన కనకరాజు పార్టీ నాయకులు, తన అనునాయులతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
రెండో రోజు నామినేషన్ల జోరు


