మాజీ సీఎం రోశయ్యకు ఘనంగా నివాళి
● పూలమాల వేసి నివాళి అర్పించిన ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య వర్ధంతిని కలెక్టరేట్‌లో జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. రోశయ్య చిత్రపటానికి ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి అజ్మీరా రాందాస్, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి, పరిశ్రమలశాఖ జీఎం హన్మంతు, డీటీసీపీవో అన్సార్ అలీ, డీఏవో అఫ్జల్‌బేగం, డీఎంహెచ్‌వో రజిత, మైనార్టీ సంక్షేమాధికారి భారతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయలక్ష్మి, మత్య్సశాఖ అధికారి సౌజన్య, పౌరసరఫరాలశాఖ మేనేజర్ రజిత తదితరులు పాల్గొన్నారు.
నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలి
నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని ఆదేశించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏకగ్రీవ స్థానాల్లో ఉపసర్పంచ్ ఎన్నిక, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు, నామినేషన్లపై వచ్చే ఫిర్యాదులపై ఎన్నికల కమిషనర్ సమీక్షించారు. టీ–పోల్‌లో పెండింగ్ లేకుండా నమోదు చేయాలని సూచించారు. లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ నగదు, మద్యం, ఆభరణాలను ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తరలించే పక్షంలో నిబంధనల ప్రకారం సీజ్ చేయాలని సూచించారు. డీఆర్డీవో శేషాద్రి, జెడ్పీ డిప్యూటీ సీఈవో గీత, డీపీవో షరీఫోద్దీన్, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.


