ఎన్నికల నియమావళి పాటించాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే
ముస్తాబాద్/ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట(సిరిసిల్ల): ఎన్నికల నియమావళిని పాటించాలని ఎస్పీ మహేశ్ బీ గీతే అన్నారు. ముస్తాబాద్ మేజర్ పంచాయతీ, ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌లోని నామినేషన్ కేంద్రాలను గురువారం పరిశీలించారు. జిల్లా సరిహద్దులోని వెంకట్రావుపల్లి, పెద్దమ్మస్టేజీ వద్ద చెక్‌పోస్టులను పరిశీలించి మాట్లాడారు. జిల్లా సరిహద్దుల్లోని చెక్‌పోస్ట్‌ల వద్ద 24 గంటలు తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. ఎవరూ నిబంధనలు అతిక్రమించొద్దని సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో బందోబస్తును పెంచినట్లు తెలిపారు. జిల్లాలోని 20 కేసుల్లో 209 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని, 158 కేసుల్లో 657 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. సీఐలు మొగిలి, శ్రీనివాస్‌గౌడ్, ఎస్సైలు గణేశ్, రాహుల్‌రెడ్డి, అనిల్‌కుమార్ ఉన్నారు.


