నిబంధనలు పాటించని ఆస్పత్రులను సీజ్ చేస్తాం
● జిల్లా వైద్యాధికారి రజిత
సిరిసిల్ల: జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, లేకుంటే ఆస్పత్రి రిజిస్ట్రేషన్ రద్దు చేసి సీజ్ చేస్తామని జిల్లా వైద్యాధికారి రజిత హెచ్చరించారు. సిరిసిల్లలోని పలు ప్రైవేటు ఆస్పత్రులను గురువారం తనిఖీ చేశారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ప్రతీ ఆస్పత్రి రిసెప్షన్ కౌంటర్ వద్ద ధరల పట్టిక వివరాలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, వైద్యుల వివరాలు ప్రదర్శించాలని సూచించారు. ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సమర్థంగా నిర్వహించాలన్నారు. డాక్టర్ రామకృష్ణ, మహేశ్‌గౌడ్ పాల్గొన్నారు.


