ముగిసిన స్క్రుటినీ
● రెండో విడత అభ్యర్థుల జాబితా ● నేడు విత్‌డ్రాలకు అవకాశం
ఇల్లంతకుంట/తంగళ్లపల్లి: జిల్లాలోని రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో వేసిన నామినేషన్ల స్క్రుటినీ బుధవారం రాత్రి పూర్తయింది. అభ్యర్థుల జాబితాను ఆర్వో కేంద్రాల్లో ప్రదర్శించారు. ఇల్లంతకుంట మండలంలో 35 గ్రామపంచాయతీల్లో పడ్డ నామినేషన్ల స్క్రుటినీ అనంతరం మిగిలిన అభ్యర్థుల జాబితా ఎంపీడీవో శశికళ ప్రకటించారు. 35 గ్రామపంచాయతీలకు 112 మంది సర్పంచ్ అభ్యర్థులు, 294 వార్డులకు 597 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్టు తెలిపారు.
నో రిజెక్షన్
తంగళ్లపల్లి మండలంలో నామినేషన్ల స్క్రుటినీలో ఒక్కటి కూడా రిజెక్ట్ కాలేదు. మండలంలోని 30 సర్పంచ్ స్థానాలకు 219 నామినేషన్లు, 252 వార్డు సభ్యుల స్థానాలకు 622 నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని నామినేషన్లు నిబంధనల మేరకే ఉన్నాయని ఎంపీడీవో లక్ష్మీనారాయణ తెలిపారు.
సిరిసిల్లక్రైం: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపట్టిన ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బుధవారం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ మోసాల నివారణపై అవగాహన కల్పించారు. సైబర్ ఎస్‌ఐ జునైద్ మాట్లాడుతూ.. నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


