రూ.60 లక్షల విలువైన ఫోన్లు రికవరీ
సిరిసిల్ల క్రైం: జిల్లా ప్రజలు వివిధ సందర్భాల్లో పోగొట్టుకున్న, చోరీకి గురైన దాదాపు రూ.60లక్షల విలువైన సెల్‌ఫోన్లను జిల్లా పోలీసులు రికవరీ చేశారు. 60 మందికి వారి మొబైల్స్‌ను ఎస్పీ మహే శ్ బీ గీతే చేతుల మీదుగా బుధవారం అందజేశా రు. పోలీస్ అధికారులు మాట్లాడుతూ ఫోన్ పోయి న వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేయడం ద్వారా ఫోన్లను రికవరీ చేయవచ్చన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,183 మొబైల్ ఫోన్లను గుర్తించి య జమానులకు అందజేసినట్లు వివరించారు. సెకండ్‌హ్యాండ్ సెల్‌ఫోన్లు కొంటే తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 83 శాతం రికవరీని సాధించడంలో కృషిచేసిన ఐటీ కోర్ ఎస్సై కిరణ్‌కుమార్, కానిస్టేబుల్ రాజా తిరుమలేశ్, సిబ్బందిని ఎస్పీ మహేశ్ బీ గీతే అభినందించారు.
దత్త ఆలయంలో ఎస్పీ పూజలు
బోయినపల్లి(చొప్పదండి): మిడ్‌మానేరు బ్యాక్ వాటర్‌లో మండలంలోని వరదవెల్లి గుట్టపై వెలసిన గురు దత్తాత్రేయస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న దత్త జయంతి ఉత్సవాలకు ఎస్పీ మహేశ్ బీ గీతే హాజరయ్యారు. వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై ఎన్.రమాకాంత్ ఉన్నారు.


