శివా.. పార్వతులకు నీడేది? | - | Sakshi
Sakshi News home page

శివా.. పార్వతులకు నీడేది?

Dec 3 2025 7:23 AM | Updated on Dec 3 2025 7:23 AM

శివా.

శివా.. పార్వతులకు నీడేది?

● ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో శివపార్వతుల కాలనీ ● అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనం ● ఉన్నవారికి కనీస సౌకర్యాలు కరువు

● ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో శివపార్వతుల కాలనీ ● అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనం ● ఉన్నవారికి కనీస సౌకర్యాలు కరువు

‘ఈ ఫొటోలోని భవనం శివపార్వతుల కాలనీలో ఓ బడా వ్యాపారికి చెందినది. ఈ కాలనీలో శివపార్వతుల నివాసాలను ఎంతకో కొంతకు కొని పెద్దపెద్ద భవనాలు నిర్మిస్తున్నారు. అద్దెకు కూడా ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి’.

వేములవాడరూరల్‌: వేములవాడ రాజన్నకు అతి ప్రీతి అయిన భక్తులు శివపార్వతులు. వీరు శివుని పేరిట భిక్షాటన చేస్తూ తిరుగుతుంటారు. రాజన్న గుడి మెట్ల వద్ద భక్తుల నుంచి భిక్షం తీసుకుంటూ ఏళ్ల తరబడి ఇక్కడే ఉంటున్నారు. 1986లో 112 మంది శివపార్వతులకు ప్రత్యేకంగా కాలనీ నిర్మించారు. వేములవాడ నుంచి సిరిసిల్లకు వెళ్లే ప్రధాన రోడ్డు పక్కన నిర్మించిన ఈ కాలనీలో శివపార్వతులు ఉండేవారు. అక్కడి నుంచి రోజూ ఉదయం దాదాపు ఆలయానికి వచ్చి మెట్ల వద్ద భక్తులు ఇచ్చిన ముడుపులు తీసుకునేవారు. కాగా, సదరు కాలనీలో ప్రస్తుతం కొంత మంది ప్రైవేటు వ్యక్తులు పాగా వేస్తున్నారు. కాలనీలో ఉన్న శివపార్వతులు కొంత మంది అనారోగ్యం, ఇతర కారణాలతో మృతిచెందగా, వారి వారసులు నివాసం ఉంటున్నారు.

బడా వ్యాపారుల చేత్తుల్లోకి కాలనీ..?

కొందరు బడా వ్యాపారులు శివపార్వతులకు, వారి కుటుంబ సభ్యులకు ఎంతో కొంత ఇచ్చి వారి పేరిట పట్టా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ వ్యక్తి పది మంది వద్ద నివాసాలు కొనుగోలు చేసి వాటికి మరమ్మతు చేపట్టి అదే శివపార్వతుల కాలనీలో ఉన్న కొంత మందికి అద్దెకు ఇస్తున్నట్లు తెలిసింది. ఈ కాలనీలో కొంతమందికి ఉపాధి కల్పించాలని గత ప్రభుత్వం కుట్టుమిషన్‌ శిక్షణ కోసం షెడ్డు ఏర్పాటు చేశారు. అది ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లినట్లు కాలనీవాసులు చెబుతున్నారు. ప్రస్తుతం కాలనీలో ఉంటున్నవారు తాగునీరు, డ్రైనేజీ తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికల సమయంలోనే కాలనీకి ప్రజాప్రతినిధులు వస్తారని, తర్వాత పట్టించుకునే వారే లేరని శివపార్వతుల వారసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శివా.. పార్వతులకు నీడేది?1
1/2

శివా.. పార్వతులకు నీడేది?

శివా.. పార్వతులకు నీడేది?2
2/2

శివా.. పార్వతులకు నీడేది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement