ప్రైవేటు ఆస్పత్రుల తనిఖీ
వేములవాడఅర్బన్: వేములవాడ పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత మంగళవారం తనిఖీ చేశారు. నిబంధనల ప్రకారం వైద్యుల పేర్లు, ఆసుపత్రిలో పనిచేసే స్టాఫ్, ధరలు తదితర వివరాలు రిసెప్షన్ కౌంటర్ వద్ద ప్రదర్శించాలన్నారు. అనుమతి లేని ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రోగ్రాం ఆఫిసర్ డాక్టర్ సంపత్‌కుమార్, మహేశ్ తదితరులు ఉన్నారు.
పదిహేను రోజుల్లోగా కూలి పెంచాలి
సిరిసిల్లటౌన్: పాలిస్టర్ వస్త్రోత్పత్తి, వార్పిన్, వైపని అనుబంధ రంగాల కార్మికులు, ఆసాములకు కూలి పెంచాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ కోరారు. మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో పాలిస్టర్ యజమానుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు అడేపు భాస్కర్, అంకారపు రవి, కమిటీ సభ్యులకు వినతిపత్రాలు అందజేశారు. 15 రోజుల వరకు కూలి పెంచకుంటే సమ్మెకు వెళ్తామన్నారు. సమావేశంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు నక్క దేవదాస్, వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సిరిమల్ల సత్యం, ఉడుత రవి, వైపని వర్కర్స్ యూనియన్ నాయకులు ఎలిగేటి శ్రీనివాస్, గడ్డం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మద్యం అమ్మకాలపై నియంత్రణ విధించాలి
సిరిసిల్లఅర్బన్: మద్యం అమ్మకాలపై ప్రభుత్వం నియంత్రణ విధించాలని, నిబంధనలు అతిక్రమిస్తున్న పర్మిట్ రూములపై చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం అన్నారు. మంగళవారం సిరిసిల్లలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత సర్కార్ మాదిరిగానే మద్యం ఆదాయంపై ఆధారపడి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తుందన్నారు. నిబంధనలు అతిక్రమించిన వైన్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు గుజ్జ దేవదాస్, సత్తయ్య, ఎల్లయ్య, రాజేశం తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
సిరిసిల్లకల్చరల్: బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ నిర్వహించిన సాహిత్య సృజన పోటీల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. తాడూరు జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థిని గడప లక్ష్మి ప్రణవిక, అంకిరెడ్డిపల్లె జెడ్పీహెచ్‌ఎస్‌లో ఏడో తరగతి విద్యార్థి కె.అక్షయ, పద్య కవితల విభాగంలో ఎల్లారెడ్డిపేట జెడ్పీహెచ్‌ఎస్ 8వ తరగతి విద్యార్థి పసునూరి దివ్యజ్యోతి, పదో తరగతి విద్యార్థి నేవూరి మీనాక్షి బహుమతులు అర్హత సాధించినట్లు అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి, ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
ప్రైవేటు ఆస్పత్రుల తనిఖీ
ప్రైవేటు ఆస్పత్రుల తనిఖీ


