క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
సిరిసిల్లఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి క్రీడలకు పెద్దపీట వేస్తుందని రాజన్న సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణం రాజీవ్‌నగర్ మినీ స్టేడియంలో 8వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. సీఎం సహాయంతో రాష్ట్రంలోనే సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచేందుకు కృషిచేస్తామన్నారు. విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలన్నారు. వాలీబాల్ బాలికల విభాగంలో మహబూబ్‌నగర్ ప్రథమ, వరంగల్ ద్వితీయ, బాలుర విభాగంలో వరంగల్ ప్రథమ, ఖమ్మం ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల రమేశ్‌బాబు, ప్రధాన కార్యదర్శి హన్మంతరెడ్డి, కృష్ణప్రసాద్, జిల్లా అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్, అజ్మీరా రాందాస్, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు వెలుముల స్వరూప, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ప్రభాకర్, శ్యాం, బొడ్డు నారాయణ తదితరులు పాల్గొన్నారు.


