చివరిరోజు జోరుగా నామినేషన్లు
తంగళ్లపల్లి/ఇల్లంతకుంట: పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల దాఖలుకు మంగళవారం మండలంలోని పలు కేంద్రాలకు సర్పంచ్, వార్డుమెంబర్ అభ్యర్థులు పోటెత్తారు. నామినేషన్‌కు చివరిరోజు కావడం సాయంత్రం 5 గంటల వరకే సమయం ఉండగా, కేంద్రాల వద్ద హడావుడి నెలకొంది. ఎక్కువ మంది మంగళవారం మంచిరోజని సెంటిమెంట్‌తో నామినేషన్లు వేయడం విశేషం.
రాత్రివరకు నామినేషన్ల స్వీకరణ
ఇల్లంతకుంట మండలంలో 35 గ్రామపంచాయతీలకు గాను 11 కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించారు. పెద్దలింగాపురం కేంద్రంలో రాత్రి 9.40 గంటలవరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతూనే ఉంది. ముస్కాన్‌పేటలో రాత్రి 9 గంటల వరకు స్వీ కరించారు. గొల్లపల్లి పంచాయతీ వార్డుసభ్యులు, సర్పంచు ఏకగ్రీవానికి ప్రయత్నాలు కుదరకపోవడంతో సాయంత్రం 4 గంటలకు నామినేషన్లు వే సేందుకు వచ్చారని తెలిసింది. దీంతో ఆ కేంద్రంలో నామినేషన్ల స్వీకరణ ఆలస్యమైనట్లు తెలుస్తోంది.


