కమ్మరిపేటతండా ఏకగ్రీవం
కోనరావుపేట: మండలంలోని కమ్మరిపేటతండా గ్రామపంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవమైంది. సర్పంచుగా భూక్య మంజుల, ఉపసర్పంచ్‌గా మాలోత్ ప్రకాశ్, వార్డుసభ్యులుగా మాలోత్ లక్ష్మి, మాలోత్ తిరుపతి, భుక్య చంద్రకళలు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. బావుసాయిపేటలో 7వ వార్డులో బైరగోని నందూగౌడ్, 10వ వార్డులో గంట మల్లయ్య, కనగర్తిలో 7వ వార్డులో పురుసాని భూలక్ష్మి, 10వ వార్డులో ఊరడి లావణ్య, ధర్మారంలో 1వ వార్డులో వెలిశాల శ్రీనివాస్, 3వ వార్డులో కీసరి కావేరి, మామిడిపల్లి 6వ వార్డులో మధునాల స్వరూప, 7వ వార్డులో కాసర్ల పవిత్ర దాదాపు ఏకగ్రీవమయ్యారు.


