ప్రజావాణి రద్దు
సిరిసిల్ల: కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేసినట్లు ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదివారం తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వినతులను స్వీకరించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
భీమన్న సేవలో ఎన్నికల పరిశీలకులు
వేములవాడ: భీమేశ్వరస్వామి ఆలయంలో సిద్దిపేట ఎన్నికల అబ్జర్వర్ హరిత (ఐఏఎస్), జగిత్యాల ఎన్నికల అబ్జర్వర్ బి.శ్రీరమేశ్ ఆదివారం దర్శించుకున్నారు. కోడెమొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు.
సంగీత సాహిత్యాల సమ్మేళనం యక్షగానం
సిరిసిల్లకల్చరల్: యక్షగాన ప్రక్రియ సంగీత, సాహిత్యాల సమ్మేళనం అని పలువురు సాహితీవేత్తలు పేర్కొన్నారు. గూడూరి రాజు వెలువరించిన బాలమతి చరిత్ర యక్షగాన పుస్తకాన్ని జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనంలో ఆదివారం సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. సమితి అధ్యక్షుడు డాక్టర్ జనపాల శంకరయ్య, సాహితీవేత్తలు సబ్బని లక్ష్మీనారాయణ, సంకెపెల్లి నాగేంద్రశర్మ అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ డిజిటల్ మాధ్యమాల కాలంలో నాటి సాంస్కృతిక రూపాలను నేటి తరానికి పరిచయం చేసే ప్రయత్నించిన రచయితను అభినందించారు. సమితి ప్రతినిధులు కోడం నారాయణ, కొక్కుల రాజేశం, కొలిపాక శోభారాణి, మాదిరెడ్డి అంజనీదేవి, ముడారి సాయిమహేశ్, బూర దేవానందం, వంశీకృష్ణ, సింగిరెడ్డి రాజిరెడ్డి, పని లక్ష్మన్, గణేశ్, రాజప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.
నామినేషన్ కేంద్రాలు పరిశీలన
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికల నామినేషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదివారం పరిశీలించారు. మండలంలోని కొదురుపాక, బోయినపల్లి, కోరెం, స్తంభంపల్లిలోని ఆర్వో కేంద్రాల్లో సిద్ధంగా ఉంచిన నామినేషన్ పత్రాలు, హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించారు. తహసీల్దార్ కాలె నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.
చెక్‌పోస్టు తనిఖీ
మండలంలోని నర్సింగాపూర్‌లో ఏర్పాటు చేసిన జిల్లా సరిహద్దు చెక్‌పోస్టును జనరల్ అబ్జర్వర్ రవికుమార్ పరిశీలించారు. చెక్‌పోస్టు సిబ్బందికి పలు సూచనలు చేశారు. మండలంలోని కొదురుపాక, వెంకట్రావుపల్లి, బోయినపల్లి, కోరెం నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఆర్డీవో రాధాభాయి స్తంభంపల్లి, బోయినపల్లి గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు.
జిల్లెల్ల చెక్‌పోస్ట్ తనిఖీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): జిల్లెల్ల చెక్‌పోస్ట్‌ను ఆదివారం రాత్రి సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచా రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్య చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజావాణి రద్దు
ప్రజావాణి రద్దు
ప్రజావాణి రద్దు
ప్రజావాణి రద్దు


