గ్రామాల్లో గల్లా ఎగిరేసి చెప్పండి
కాంగ్రెస్ కండువాలతోనే ప్రచారం చేయండి సంక్షేమాలు ఇస్తాం.. అభివృద్ధి చేస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్ డీసీసీ అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం
సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామాల్లో గల్లా ఎగిరేసి చెప్పాలని రాష్ట్ర రవా ణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్ప ష్టం చేశారు. జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్ ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచి త విద్యుత్, రేషన్‌కార్డులు, రూ.10లక్షల ఆరోగ్యశ్రీ వైద్యసేవలు, రైతు రుణమాఫీ, రైతులకు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించినట్లు వివరించారు. చేనేత కార్మి కులకు ఉపాధి కల్పిస్తూ.. గత ప్రభుత్వం బకాయి పెట్టిన డబ్బులను విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కండువాతో గుండెల నిండా ధైర్యంతో గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చేలా ప్రతీ కార్యకర్త పనిచేయాలని సూచించారు. మాజీ ఎంపీ హన్మంతరావు మాట్లాడుతూ సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే.. దీక్షా దివస్ అంటూ బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే.. కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా వద్ద బిచ్చం ఎత్తుకునే వారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీని వాస్ మాట్లాడుతూ.. 1982 నుంచి ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో పనిచేశానని, ఏఎంసీ చైర్మన్‌గా ఐదేళ్లు పనిచేసినట్లు గుర్తు చేశారు. డీసీసీ అధ్యక్షుడిగా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఏఎంసీ చైర్మన్ స్వరూపారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కటుకం మృత్యుంజయం, పార్టీ నాయకులు ఉమేశ్‌రావు, గడ్డం నర్సయ్య, సూర దేవరాజు, ఆకునూరి బాలరాజు, గోలి వెంకటరమణ, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, ఆడెపు చంద్రకళ పాల్గొన్నారు.
నేతన్నచౌక్ నుంచి ర్యాలీ
సిరిసిల్ల పాతబస్టాండులోని నేతన్న విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి స్థానిక నాయకులు పూలమాల వేశారు. గజమాలతో సత్కరించి ర్యాలీగా విద్యానగర్‌లోని లహరి ఫంక్షన్ హాల్‌కు చేరుకున్నారు.


