ఎన్నికల్లో కలిసి పనిచేయాలి
● బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు కూర్చుని మాట్లాడుకుని అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సూచించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం కేటీఆర్ పర్యటించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యకు ఇటీవల భుజానికి సంబంధించిన శస్త్రచికిత్స జరగగా.. ఇంటికెళ్లి కేటీఆర్ పరామర్శించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో ప్రతీ గ్రామపంచాయతీలో బీఆర్‌ఎస్ జెండాను ఎగురవేయాలన్నారు. భేషజాలకు పోకుండా ప్రజలతో పట్టున్న వారిని ఎంపిక చేసుకోవాలని సూచించారు. కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణహరి, సింగల్‌విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సెస్ మాజీ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్లు అందె సుభాష్, గుల్లపల్లి నరసింహారెడ్డి, కొండ రమేశ్, మండలంలోని వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
పేదలను ఆదుకోవడమే కులసంఘాల లక్ష్యం కావాలి
పేదలను, ఆర్థికంగా ఇబ్బందుల్లో వారిని ఆదుకునే ఔదార్యం కులసంఘాల లక్ష్యం కావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలో వెలమ సంక్షేమ మండలి(పద్మనాయక) అదనపు వసతిగృహ భవనానికి ఆదివారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. జిల్లాలోని వెలమ సంక్షేమ మండలికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. కులంలో ఉన్న పేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుండాలని కోరారు. సంక్షేమ మండలి జిల్లా అధ్యక్షుడు చిక్కాల రామారావును సన్మానించారు. మండలి ప్రధాన కార్యదర్శి గుజ్జునేని వేణుగోపాల్‌రావు, ఉపాధ్యక్షులు సురభి దశరథరావు, చీటి నర్సింగరావు, బి.వేఘమాల, కోశాధికారి బొంత వేణుగోపాల్‌రావు, సంయుక్త కార్యదర్శి కడపత్రి అనిల్‌రావు, జూపల్లి శ్రీలత, ఆర్గనైజింగ్ కార్యదర్శి అయిల్నేని పాపారావు తదితరులు పాల్గొన్నారు.


