సరిహద్దు చెక్‌పోస్టులు తనిఖీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికల నామినేషన్ కేంద్రాలు, జిల్లెల్ల చెక్‌పోస్ట్‌ను ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ ఆదివారం పరిశీలించారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేశారు. జిల్లెల్ల జీపీ కార్యాలయంలోని ఆర్వో కేంద్రం, తంగళ్లపల్లి మండల పరిషత్‌లోని పోస్టల్ బ్యా లెట్ హెల్ప్‌డెస్క్, ఆర్వో కేంద్రాన్ని పరిశీలించారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎంపీడీవో కె.లక్ష్మీనా రాయణ, తహసీల్దార్ జయంత్‌కుమార్ ఉన్నారు.
ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు
సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి హెచ్చరించారు. సిరిసిల్లలో ఆదివా రం విలేకరులతో మాట్లాడారు. సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికల సమయంలో గ్రామాల్లో అభ్యర్థులు, వారి అనుచరులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, కులసంఘాలకు డబ్బు పంచడం, గ్రామాభివృద్ధి పేరుతో డబ్బులు ఆశ చూపితే కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకునేలా జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు.
సరిహద్దు చెక్‌పోస్టులు తనిఖీ


