ఇసుక రీచ్ వద్ద ట్రాక్టర్ల క్యూ !
శ్రీ శ్రీనివాసం.. శిరసా నమామి
సిరిసిల్లటౌన్: శ్రీశాల శ్రీనివాసుడు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చాడు. శనివారం శ్రీవారికి ఏకాంతసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామిని మల్లెలతో అలంకరించారు. శ్రీవారి దివ్యరూపాన్ని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ఈవో మారుతీరావు, ఏఈవోలు పీసరి రవీందర్, కూనబోయిన సత్యం, అర్చకస్వాములు మాడంరాజు కృష్ణమాచారి, మాడంరాజు సుకుమారచారి పాల్గొన్నారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండెపల్లి ఇసుక రీచ్ నుంచి ఇసుక తరలించేందుకు వే బిల్లులు ఇచ్చిన రెవెన్యూ అధికారులు మధ్యలోనే క్యాన్సిల్ చేశారని ట్రాక్టర్ యజమానులు శనివారం తెలిపారు. 50 ట్రాక్టర్లను మండెపల్లి రీచ్ వద్ద నిలిపి ధర్నా చేశారు. ఈ విషయంపై తంగళ్లపల్లి తహసీల్దార్ జయంత్‌కుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా వేబిల్లులు ఇచ్చింది వా స్తవమేనని, డ్రైవర్లు ఇష్టానుసారంగా నడిపి వ్యవసాయ పైప్‌లైన్లు పాడుచేసినట్లు ఫిర్యాదు వచ్చి నట్లు తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్లను పిలిచి సమస్యరాకుండా నడపాలని సూచించినట్లు పేర్కొన్నారు.
ఇసుక రీచ్ వద్ద ట్రాక్టర్ల క్యూ !


