బ్యాలెట్ బాక్సులు వచ్చేశాయ్..
తంగళ్లపల్లి(సిరిసిల్ల): స్థానిక ఎన్నికల మొదటి విడత నామినేషన్లు శనివారంతో పూర్తయి, రెండో విడత ఎన్నికల నామినేషన్లు ఆదివారంతో ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యా లెట్ బాక్సులు మండల కేంద్రాలకు చేరుతున్నాయి. శనివారం తంగళ్లపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని స్ట్రాంగ్‌రూమ్‌లో బ్యాలె ట్ బాక్స్‌లను అధికారులు భద్రపరిచారు. మండలంలో 255 పోలింగ్ కేంద్రాలు ఉండగా 277 బ్యాలెట్ బాక్సులు కేటాయించారు. డిసెంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీవో మీర్జా అఫ్జల్ అహ్మద్ బేగ్, అధికారులు రాజునాయక్, బండి లక్ష్మణ్ పర్యవేక్షించారు.
ఇల్లంతకుంట(మానకొండూర్): పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సమష్టిగా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. మండలంలోని పత్తికుంటపల్లి, తాళ్లపల్లి, ముస్కానిపేటలకు చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు శనివారం కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ మండలాధ్యక్షుడు కె.భాస్కర్‌రెడ్డి, నాయకులు వెంకటరమణారెడ్డి, గుడిసె ఐలయ్య, తిరుపతిరెడ్డి, ఎలుక రామస్వామి, నగేశ్, నరసింహారెడ్డి పాల్గొన్నారు.
సిరిసిల్లకల్చరల్: విద్యార్థులు, పిల్లల భద్రతకు సంబంధించిన అంశాల్లో పెద్దలు బాధ్యతా యుతంగా వ్యవహరించాలని పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ కోరారు. స్థానిక శివనగర్‌లోని మహర్షి ఇంగ్లిష్ మీడి యం హైస్కూల్‌లో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు, ప్రధాన న్యాయమూర్తి బి.పుష్పలత, కార్యదర్శి పి.లక్ష్మణాచారి మార్గదర్శకత్వంలో చట్టాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. పిల్లలపై లైంగిక నేరాల నియంత్రణకు రూ పొందించిన పోక్సో చట్టంలోని కీలకాంశాలను వివరించారు. లోక్ అదాలత్ సభ్యులు గుర్రం ఆంజనేయులు, ఆడెపు వేణు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జ్యోతి, ప్యానెల్ అడ్వకేట్ అరుణ, హెచ్‌ఎం బూర శ్వేత పాల్గొన్నారు.
నేడు సిరిసిల్లకు మంత్రి పొన్నం రాక
సిరిసిల్లటౌన్: మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ ఆదివారం సిరిసిల్లకు వస్తున్నారు. ఇటీవల నియమితులైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి వస్తున్నారు.
సిరిసిల్లకల్చరల్: జిల్లాకు చెందిన కవి గూడూరి బాలరాజు రచించిన బాలమణి చరితం యక్షగానం పుస్తకాన్ని ఆదివారం ఆవిష్కరించనున్నట్లు సిరిసిల్ల సాహితీ సమితి అధ్యక్షుడు డాక్టర్ జనపాల శంకరయ్య తెలిపారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
జిల్లా ఐఎంఏ అధ్యక్షురాలిగా డాక్టర్ శోభారాణి
సిరిసిల్ల: జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) అధ్యక్షురాలిగా డాక్టర్ పి.శోభారాణి, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ అభినవ్ ఎన్నికయ్యారు. జిల్లా ఐఎంఏ కార్యవర్గ సమావేశం శుక్రవారం రాత్రి జరిగింది. కార్యక్రమంలో వైద్యులు సంతోష్, ప్రసాద్‌రావు, రమణారావు, మురళీధర్‌రావు, శ్రీనివాస్, పెంచలయ్య, శ్రీవాణి, పద్మలత, గీతావాణి తదితరులు పాల్గొన్నారు.
బ్యాలెట్ బాక్సులు వచ్చేశాయ్..
బ్యాలెట్ బాక్సులు వచ్చేశాయ్..
బ్యాలెట్ బాక్సులు వచ్చేశాయ్..


