వెల్లువెత్తిన నామినేషన్లు
ఆఖరి రోజు రాత్రి వరకు కొనసాగిన దరఖాస్తుల దాఖలు
85 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు 572 నామినేషన్లు
748 వార్డు మెంబరు స్థానాలకు 1767 నామినేషన్ల దాఖలు
నేటి నుంచి రెండో విడత షురూ..
మండలం సర్పంచ్ నామినేషన్లు వార్డు నామినేషన్లు
రుద్రంగి 10 39 86 180
చందుర్తి 19 111 174 394
వేములవాడ అర్బన్ 11 122 104 345
కోనరావుపేట 28 202 238 513
వేములవాడ రూరల్ 17 98 146 335
సిరిసిల్ల: జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు నా మినేషన్ల ఘట్టం శనివారం సాయంత్రంతో ముగిసింది. వేములవాడ అర్బన్, రుద్రంగి, కోనరావుపేట, వేములవాడరూరల్, చందుర్తి మండలాల్లోని 85 గ్రామాల్లో సర్పంచ్, 748 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లను రాత్రి వరకు క్యూ లైన్ కట్టి మరీ అభ్యర్థులు పోటీ చేశారు. నా మినేషన్ల దాఖలుకు ముహూర్తం చూసుకుని రావడంతో శనివారం నవమి కావడంతో ఆఖరి రోజు నామినేషన్లు వెల్లువెత్తాయి. వేములవాడఅ ర్బన్ మండలం అనుపురంలో రాత్రి 8.40 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వా స్తవానికి శనివారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా.. రిటర్నింగ్ అధికారి(ఆర్వో) వద్దకు ఒకే సారి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు వచ్చారు. దీంతో 5 గంటల్లోగా ఆర్వో ఆఫీస్ వచ్చిన అభ్యర్థులకు టోకెన్ నంబర్ కేటాయించి రాత్రి వరకు నామినేషన్ల దాఖలు కొనసాగించారు. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 5 గంటల తర్వాత చెల్లుబాటు అయిన అభ్యర్థుల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వెల్లడిస్తారు.
నేటి నుంచి రెండో విడత నామినేషన్లు
బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో ఆదివారం నుంచి నామినేషన్ల పర్వం మొదలుకానుంది. బోయినపల్లి మండలంలోని 23 సర్పంచ్, 212 వార్డు స్థానాలకు, ఇల్లంతకుంట మండలంలోని 35 సర్పంచులు, 294 వార్డులు, తంగళ్లపల్లి మండలంలోని 30 సర్పంచ్ స్థానాలకు, 252 వార్డుమెంబర్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ మూడు మండలాల్లోని 88 గ్రామాల సర్పంచ్‌లకు, 758 వార్డులకు నామినేషన్లు వేయనున్నారు. డిసెంబరు 2తో నామినేషన్లకు చివరి గడువు. ఈమేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు.


