● కొత్త గ్రామపంచాయతీల్లో ఎన్ని‘కళ’ ● ఐదు గ్రామాల్లో తొల
సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన ఐదు గ్రామపంచాయతీలు బాకూర్‌పల్లితండా, తాళ్లల్లపల్లి, బోటుమీదిపల్లి, హీరాలాల్‌తండా, జైసేవాలాల్‌తండాలలో తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. రెండేళ్ల క్రితం ఏర్పడ్డ జీపీలు ప్రత్యేకాధికారుల పాలనలోనే మగ్గాయి. తమ గ్రామంలోని వ్యక్తినే సర్పంచ్‌గా ఎన్నుకునే అవకాశం వారికి ఈసారి దక్కుతుంది. జిల్లాఓ మరో రెండు గ్రామాలు బద్దెనపల్లి, గొల్లపల్లిల్లో ఏడేళ్లకు పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. స్వయంపాలన దిశగా అడుగులు వేస్తున్న గ్రామాల్లో పరిస్థితిపై ప్రత్యేక కథనం.
ఏడేళ్లుగా ఎన్నికలకు దూరం
2019లో జిల్లాలోని అన్ని గ్రామాలకు ఎన్నికలు జ రగ్గా.. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి, ఇల్లంతకుంట మండలం గొల్లపల్లిలో ఎన్నికలు జరగలేదు. బద్దెనపల్లి జనాభాలో సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యార్థులను లెక్కించారు. దీంతో ఎస్సీల సంఖ్య పెరిగిపోయి గ్రామ సర్పంచ్ పదవి ఆ సామాజి కవర్గానికి రిజర్వు అయింది. దీంతో ఆ గ్రామానికి చెందిన వారు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నిక ఆగిపోయింది. ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి గ్రామస్తులు 2019లో గ్రామంలోని భూసమస్యలు పరిష్కారం కాలేదని, తమ ఊరు వారిని పక్క ఊరి ఓటర్ల జాబితాలో చేర్చారంటూ ఎన్నికలు బహిష్కరించారు. ఆ సమయంలో ఒక్కరు కూడా నామినేషన్ వేయకపోవడంతో ఎన్నికలు జరగలేదు. జిల్లాలో ని ఈ రెండు గ్రామాల్లో ఐదేళ్లు స్థానిక పాలన లేకపోగా.. మరో రెండేళ్లు ప్రత్యేకాధికారి పాలన సాగింది.
గిరి‘జన’ తండాలు పంచాయతీలుగా..
అటవీ ప్రాంతాల్లో నివసించే ‘గిరి’జనులకు 2019లో పాలనా పగ్గాలు దరిచేరాయి. అడవిని నమ్ముకుని జీవించే గిరిపుత్రులు తొలిసారిగా సర్పంచులు, వార్డు సభ్యులు.. ఉపసర్పంచ్‌గా పదవులు పొందారు. జిల్లాలో కొత్తగా 25 గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చుతూ 2018 ఆగస్టు 2న ప్రభుత్వం జీవో జారీ చేయగా.. 2019లో ఎన్నికలు జరిగాయి. రుద్రంగి మండలం మానాలలోనే 8 గిరిజన తండాలు గ్రామపంచాయతీలుగా అవతరించాయి.
ఇది ఎల్లారెడ్డిపేట మండలంలోని జైసేవాలాల్ తండా గ్రామపంచాయతీ తాత్కాలిక భవనం. ఈ గ్రామంలో 450 వరకు జనాభా.. 236 మంది ఓటర్లు ఉన్నారు. ఇంతకాలం గుండారం పరిధిలో ఉండగా.. జీపీగా ఏర్పాటైన తర్వాత తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. వందశాతం గిరిజనులు ఉండే ఈ తండా జీపీలో స్వయం పాలన రానుంది.


