కొత్త కొత్తగా ఉన్నదీ!
ఇది ఇల్లంతకుంట మండలం బోటుమీదిపల్లి. ఇన్నాళ్లు దాచారం గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది. ఇప్పుడు కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటైంది. ఈ గ్రామంలో 400 వరకు జనాభా ఉండగా, ఓటర్లు 157 మంది ఉన్నారు. ఈసారి వీరి ఊరిలోని వ్యక్తినే సర్పంచ్‌గా ఎన్నుకునే అవకాశం దక్కుతుంది. బోటుమీదిపల్లిలో ఈసారి గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇది గంభీరావుపేట మండలం హీరాలాల్‌తండా. ముచ్చర్ల గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది. రెండేళ్ల క్రితం కొత్త జీపీగా ఏర్పడింది. అప్పటి నుంచి ఎన్నికలు లేకపోవడంతో స్థానిక పాలన లేదు. ఇప్పుడే తొలిసారి పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. జనాభా 500 కాగా ఓటర్లు 279 మంది ఉన్నారు.
కొత్త కొత్తగా ఉన్నదీ!
కొత్త కొత్తగా ఉన్నదీ!


