మోసపోయిన ప్రజలు గోస పడుతుండ్రు
కేసీఆర్ దీక్షతోనే రాష్ట్ర సాధన
మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్
తెలంగాణ భవన్‌లో ఘనంగా దీక్షా దివస్
సిరిసిల్ల: ఎన్నికల్లో మోసపోయిన ప్రజలు ఇప్పుడు గోసపడుతున్నారని మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ వద్ద శనివారం నిర్వహించిన దీక్షా దివస్‌లో మాట్లాడారు. కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందన్నారు. 2009 నవంబరు 29న కేసీఆర్ చేపట్టిన దీక్షను తెలంగాణ సమాజం మరిచిపోదని, నేటి తరానికి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రాష్ట్రాన్ని సీఎం రేవంత్‌రెడ్డి మూడు ముక్కలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజన్–2047 పేరిట ఓఆర్‌ఆర్ వరకు అర్బన్ తెలంగాణ, ఆర్‌ఆర్‌ఆర్ వరకు సెమీ అర్బన్, మిగతా జిల్లాలను గ్రామీణ తెలంగాణగా చూపుతున్నారని వివరించారు. రాష్ట్రం రాకముందు.. వచ్చిన తరువాత మార్పులను సమాజం గమనించిందన్నారు. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ కేసీఆర్ చేసినన్ని పదవీ త్యాగాలు చరిత్రలో ఎవరూ చేయలేదన్నారు. ఉద్యమంలో తెలంగాణ భావజాల వ్యాప్తికి కేసీఆర్ స్వయంగా పాటలు రాశారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, నాయకులు జిందం చక్రపాణి, న్యాలకొండ అరుణ, గూడూరి ప్రవీణ్, ఆకునూరి శంకరయ్య, ఏనుగు మనోహర్‌రెడ్డి, జిందం కళాచక్రపాణి, రామతీర్థపు మాధవి, బొల్లి రామ్మోహన్, సిద్ధం వేణు, కుంబాల మల్లారెడ్డి, అర్బన్ బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ, ‘సెస్’ వైస్ చైర్మన్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


