గంభీరావుపేట యువకునికి నేవీలో ఉద్యోగం
గంభీరావుపేట(సిరిిసిల్ల): గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన బి.నిహాంత్‌గౌడ్ నేవీలో సబ్ లెఫ్టినెంట్ ఉద్యోగం సాధించాడు. స్వప్న కుమారుడు నిహాంత్‌గౌడ్ శనివారం ఉద్యోగంలో చేరాడు. కోరుకొండ సైనిక్ స్కూల్‌లో ఆరోతరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. స్కూల్‌లోనే నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఎంపికయ్యాడు. పూణెలో మూడేళ్లపాటు కోర్సు పూర్తి చేసుకున్నాడు. ఏడాదిగా నేవీ ఉద్యోగం కోసం శిక్షణ పొందాడు. ఉద్యోగం సాధించిన నిహాంత్‌గౌడ్‌ను గ్రామస్తులు అభినందిస్తున్నారు.
రాజన్న గోశాల తనిఖీ
వేములవాడఅర్బన్: వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్‌లోని రాజన్న గోశాలను ఈవో రమాదేవి శనివారం తనిఖీ చేశారు. గోశాలలోని గోవులకు, కోడెలకు అందిస్తున్న గ్రాసం, ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. చలికాలంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
వేములవాడ: భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనులు చేపట్టాలని ఈవో రమాదేవి సూచించారు. భక్తుల ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. ఆలయ ఇన్‌స్పెక్టర్ ఎడ్ల శివసాయి, ఎస్పీఎఫ్ ఏఎస్సై మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
గంభీరావుపేట యువకునికి నేవీలో ఉద్యోగం


